Showing posts with label బౌద్ధ గ్రంథాలు. Show all posts
Showing posts with label బౌద్ధ గ్రంథాలు. Show all posts

బౌద్ధ గ్రంథాలు

త్రిపిటకాలు | బౌద్ధ గ్రంథాలు | Tripitaka Buddhist Scriptures

త్రిపిటకాలు*

బౌద్ధ గ్రంథాలు త్రిపిటకాలు.ఇవి పాళీ భాషలో ఉన్నాయి. త్రి అనగా మూడు.పిటకం అనగా గంప అని అర్థం.బౌద్ధ సాహిత్యం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించి మూడు గంపలకెత్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు.

త్రిపిటకాలు

1.సుత్త పిటకం
2.వినయ పిటకం
3.అభిదమ్మ పిటకం

సుత్త పిటకం

సుత్త పిటకంలో ఐదు భాగాలు ఉంటాయి. వీటిని నికాయాలు అంటారు. బుద్ధుడి ఉపన్యాసాలు, సంవాదాలు ఇందులో ఉంటాయి.

సుత్త అనే సంస్కృత భాషలోని పదానికి అర్థం సూత్రాలు అని.ఈ సుత్త పదానికి సమాన అర్థాన్ని ఇచ్చే పాళీ భాషలోని పదం సుత్త..సుత్త పిటకం లో బుద్ధ భగవాన్ ఇచ్చిన సందేశాలను,బోధనలు, శిష్యులతో సంభాషణలు అక్షరబద్ధం చేశారు. సుత్త పిటకాన్ని ఐదు భాగాలుగా చేశారు.

అవి

1.దీఘ నికాయం.
2.మజ్జిమనికాయం.
3.సంయుత్తనికాయం.
4.అంగుత్తరనికాయం.
5.ఖుద్ధకనికాయం.

ధమ్మపదమ్

ఖుద్ధకనికాయంలో ముఖ్రమైనదే ధమ్మ పదమ్.ధమ్మాన్ని వివరించే పదమ్ ఇది.ధమ్మ పదమ్ పాలీ భాషలో ఉంటుంది.

బుద్ధుడు ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాషలోనే బోధలు చేశాడు. తన ధమ్మం నిరక్షరాస్యులకు అర్థం కావాలనే పాలీ భాషను ఎంచుకున్నాడు గౌతమ బుద్ధుడు.

ధమ్మ పదమ్ లో కవితా మాధుర్యం ఉంటుంది. ఈ ధమ్మ పదమ్ లోని కవితా ఖండికలను బుద్ధుని శిష్యులు సేకరించగా బుద్ధుడు సంస్కరించారు.

ఎంతో గంభీరమైన భావాన్ని కూడా బుద్ధుడు ధమ్మ పదమ్ లో చాలా సులువుగా, బోధకంగా చెప్పాడు.

వినయ పిటకం

బౌద్ధ సంఘాలకు సంబంధించిన నియమాలను ఈ వినయ పిటకం లో చూడొచ్చు. బౌద్ధ సంఘం అంటే భిక్ఖు సంఘం.భిక్ఖు, భిక్ఖుణిలు పాటించాల్సిన నియమాలు‌,క్రమశిక్షణ గురించి ఇందులో ఉంటాయి.

వినయ పిటకం మూడు భాగాలుగా విభజించడమైనది.

అభిధమ్మ పిటకం

బౌద్ధ ధమ్మంలో ముఖ్యమైనది ఇది.ఇందులో ఏడు భాగాలు ఉంటాయి. ఈ అభిధమ్మ పిటకంలో నీతి గురించి దాని వెనుక దాగి ఉన్న మనో వైజ్ఞానిక విషయాలు గురించి ఉంటుంది.

ఉపాసక : ఆల్సి నాగసేన బోధి

పదహారు మహాజనపదాలు

అంగుత్తర నికాయ వంటి పురాతన బౌద్ధ గ్రంథాలలో ఈ పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్రాలు-అంగ, అస్కాకా, అవంతి, చెడి, గాంధార, కషి, కంబోజ, కోసల, కురు, మగధ, మల్లా, మత్స్య (లేదా మచ్చ), పాంచాల, సురసేన, వెర్జి, వాట్సా ప్రస్తావన ఉంది.

ఈ కాలంలో సింధు నాగరికత తర్వాత భారతదేశంలో పట్టణీకరణ (రెండవ) అతిపెద్ద పెరుగుదల కనిపించింది.

01.తాత్వికులు బుద్ధుడు చరిత్ర

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు Part I చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు (Part I) సారాంశం ...