Showing posts with label సైరస్ మహారాజు క్రీ.పూ. 530 లేదా 529. Show all posts
Showing posts with label సైరస్ మహారాజు క్రీ.పూ. 530 లేదా 529. Show all posts

సైరస్ మహారాజు క్రీ.పూ. 530 లేదా 529

సైరస్ మహారాజు – పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు

SEO Keywords: సైరస్, Cyrus the Great, పర్షియన్ సామ్రాజ్యం, అకేమెనిడ్ వంశం, సైరస్ సిలిండర్, ప్రాచీన పర్షియా చరిత్ర

సైరస్

సైరస్ – పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు
సైరస్ ఒక పర్షియన్ షాహన్‌షాహ్ (రాజులకు రాజు). అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతని పరిపాలనలో సామ్రాజ్యం పశ్చిమాన ఈజిప్టు నుండి తూర్పున సింధు నది వరకు విస్తరించింది.

ఇతను ఒక పర్షియన్ షాహన్‌షాహ్ (షాహ్ = రాజు, షాహన్‌షాహ్ = రాజులకు రాజు, "చక్రవర్తి"), అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు.

ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నైఋతి ఆసియా, మిక్కిలి మధ్య ఆసియా భాగాలు, ఈజిప్టు నుండి పశ్చిమాన హెల్లెన్స్‌పాంట్ వరకూ, తూర్పున సింధు నది వరకు, విశాలంగా వ్యాపించియుండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యము చరిత్రలో గాని నేటికినీ లేదు.

సైరస్ విజయాలు

ఇతని 29–30 సంవత్సరాల రాజ్యకాలంలో, ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలను జయించాడు. అలాంటి వాటిలో మిడియన్ సామ్రాజ్యం, లిడియన్ సామ్రాజ్యం, నియో బాబిలోనియన్ సామ్రాజ్యం మొదలైనవి.

ఇవి కాకుండా మధ్యాసియా లోని అనేక దేశాలు ఇతని ఆధీనంలోకొచ్చాయి. సైరస్ ప్రాచీన ఈజిప్టు వైపు వెళ్ళలేదు. ఇతడు సిథియన్లతో సిర్ దర్యా వెంట పోరాడుతూ క్రీ.పూ. 530 లేదా 529 లో యుద్ధమైదానంలోనే మరణించాడు.

ఇతడి తరువాత ఇతని కుమారుడు కాంబిసెస్ II రాజయ్యాడు. కొద్దిపాటి రాజ్యకాలంలోనే ఈజిప్టును జయించాడు.

సైరస్ పరిపాలన

తన దేశంలోనే కాక యూద మతము లోనూ, మానవహక్కుల విషయాలలో, రాజకీయాలలో, మిలిటరీ విధానలలో, ఇటు తూర్పు దేశాలలోనూ అటు పాశ్చాత్య దేశాలలోనూ గుర్తింపబడినాడు.

సైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము మరియు ఉదారత కలిగివుండేవి. ఈ విషయం ఇతని "సిలిండర్ శాసనం" ద్వారా తెలుస్తున్నది.

ఖురాన్ మరియు దుల్‌కర్నైన్

దుల్‌కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడి గురించి ఖురాన్ లో పొగడబడింది. ఖురాన్ లో వర్ణింపబడిన దుల్‌కర్నైన్ ఈ సైరస్ ఒకరేనని కొందరు భావిస్తున్నారు.

యూదుల చరిత్రలో సైరస్

నెబూచద్‌నెజ్జార్-2 అనే రాజు జెరూసలేంను ధ్వంసంచేసి, యూదులను వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగి వారికప్పగించి వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేశాడు.

ఈ విషయం యూదుల బైబిల్ కెటువీం లోని రెండవ క్రానికల్ లో ప్రస్తావించబడింది. ఈ విషయము ఎజ్రా గ్రంథం లోనూ లిఖించబడింది.

సైరస్ సిలిండర్

సైరస్ కాలంనాటి వనరు, అదియూ శంఖాకారపు పత్రము (డాక్యుమెంట్) సైరస్ గురించి తెలియజెప్పే ఓ అరుదైన వనరు. దీనినే "సైరస్ సిలిండర్" అంటారు.

ఇందుపై బాబిలోనియన్ భాషలో లిఖింపబడింది. ఇది సైరస్ పరిపాలన విధానం, మతసహనం మరియు ప్రజల పట్ల అతని దయను తెలియజేస్తుంది.

01.తాత్వికులు బుద్ధుడు చరిత్ర

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు Part I చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు (Part I) సారాంశం ...