సాహిత్య ఆధారాలు – బౌద్ధ సాహిత్యం మరియు తత్వవేత్తలు
సాహిత్య ఆధారాల విభాగాలు
- మత ఆధారాలు
- లౌకిక ఆధారాలు
- స్వదేశీ ఆధారాలు
- విదేశీ ఆధారాలు
ముఖ్యమైన బౌద్ధ రచయితలు
అశ్వఘోష – సంస్కృతంలో "బుద్ధచరిత" అనే గ్రంథాన్ని రచించాడు. ఇది బుద్ధుని జీవిత చర్యలను వివరించే గ్రంథం. అశ్వఘోషుడు కనిష్కుని సమకాలీనుడు. అతను పండితుడు, కవి, నాటకకర్త, సంగీత విద్వాంసుడు మరియు గొప్ప వాదకుడు.
నాగార్జున – మహాయాన బౌద్ధమతంలోని మధ్యమక పాఠశాల స్థాపకుడు. ఆయన బౌద్ధ తత్వశాస్త్ర అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించాడు.
అసంగ మరియు వసుబంధు – ఈ ఇద్దరూ సోదరులు. వసుబంధు రచించిన "అభిధర్మకోశ" బౌద్ధమతానికి సంబంధించిన ఎన్‌సైక్లోపీడియాగా ప్రసిద్ధి చెందింది. అసంగ యోగాచార లేదా విజ్ఞానవాద పాఠశాలలో ప్రముఖ ఉపాధ్యాయుడు. నాల్గవ శతాబ్దంలో ఈ ఇద్దరు పంజాబ్ ప్రాంతంలో బౌద్ధమతాన్ని విస్తరించారు.
బుద్ధఘోష – ఆయన గొప్ప పాళీ పండితుడు. ఆయన రచించిన "విశుద్ధిమగ్గ" (శుద్ధి మార్గం) బుద్ధుని విముక్తి మార్గాన్ని వివరించే ప్రముఖ గ్రంథంగా గుర్తింపు పొందింది.
దిన్నాగ – బౌద్ధ తర్కశాస్త్ర స్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఐదవ శతాబ్దపు గొప్ప మేధావిగా ఆయనను భావిస్తారు.
ధర్మకీర్తి – ఏడవ శతాబ్దానికి చెందిన ప్రముఖ బౌద్ధ తార్కికుడు మరియు తాత్విక ఆలోచనాపరుడు. తర్కశాస్త్రం మరియు తత్వశాస్త్రంలో గొప్ప కృషి చేశాడు.
బౌద్ధ సాహిత్యం
బౌద్ధ ధర్మానికి సంబంధించిన సాహిత్యం పాళీ, మాగధి మరియు ప్రాకృత భాషల్లో లభిస్తుంది. పాళీ భాషలో రాసిన ముఖ్యమైన ధర్మ గ్రంథాలు త్రిపీఠకాలు.
- సుత్త పీఠిక
- వినయ పీఠిక
- అభిదమ్మ పీఠిక
పీఠిక అంటే చిన్న గంప అని అర్థం. బుద్ధుని మరణానంతరం ఆయన బోధనలను మూడు గంపల్లో సేకరించారు. వాటినే త్రిపీఠకాలు అని పిలుస్తారు.
మిలిందపఞ్హ
"మిలిందపఞ్హ" అంటే "మిలిందుని ప్రశ్నలు" అనే అర్థం. ఇది క్రీ.పూ 100 నుండి క్రీ.శ 200 మధ్య కాలానికి చెందిన బౌద్ధ గ్రంథం.
ఈ గ్రంథంలో బౌద్ధ ఋషి నాగసేన మరియు ఇండో-గ్రీక్ రాజు మెనాండర్ I (పాళీ: మిలింద) మధ్య జరిగిన సంభాషణలను వివరించారు.
సామకాలీన తత్త్వవేతలు
కన్‌ఫ్యూషియస్ (క్రీ.పూ 551 – 479) చైనాకు చెందిన తత్వవేత్త. అతని బోధనలు చైనా, కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం దేశాల ఆలోచన విధానాలపై గొప్ప ప్రభావం చూపాయి.
సోక్రటీస్ (క్రీ.పూ 470 – 399) గ్రీకు దేశంలోని ఏథెన్స్‌కు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. ఆయన రూపొందించిన సోక్రటిక్ విధానం ద్వారా ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని వెలికితీయడం అనే బోధనా విధానం ప్రసిద్ధి చెందింది. ప్లేటో మరియు అరిస్టాటిల్ వంటి తత్వవేతలపై ఆయన ప్రభావం ఎంతో ఉంది.