జొరాస్ట్రియన్ మతం, మగధ సామ్రాజ్యం మరియు ప్రాచీన తాత్విక చరిత్ర
జొరాస్ట్రియన్ మతం
జొరాస్ట్రియన్ (ఆంగ్లం : Zoroastrianism) ఇరాన్ (పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ప్రాచీన మతం. ఈ మతాన్ని "మజ్దాయిజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈ మతంలో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతం ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.
జొరాస్ట్రియన్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్టర్ (Zoroaster) అను ప్రవక్త. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి.
అవెస్తా గ్రంథం
జొరాస్ట్రియన్లు చదివే అవెస్తా గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్తా గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్తా (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది.
ఈ గ్రంథం గ్రీకు వీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్తా చాలా వరకూ నాశనమైయ్యింది. నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది.
జొరాస్ట్రియన్ దేవాలయాలు
జొరాస్ట్రియన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు.
తరువాత కాలంలో అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించబడినవి. వీటినే అగ్ని దేవాలయాలు (Fire Temples) అంటారు. ఇవి టర్కీ, ఇరాన్ మరియు భారతదేశంలో కనిపిస్తాయి.
జొరాస్ట్రియన్ నమ్మకాలు
జొరాస్ట్రియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.
ఈ ప్రపంచం మంచికి చెడుకి మధ్య యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనిషి దుష్టత్వం నుండి దూరంగా ఉండాలి మరియు సత్ప్రవర్తనను అనుసరించాలి.
జొరాస్ట్రియన్ సూక్తులు
- అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు అబద్ధమాడకుము.
- అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు ఆశ కలిగియుండకుము.
- ఆవేశపడకుము.
- ఆందోళన పడకుము.
- మోహపడకుము.
- సోమరితనమును చేరనీయకుము.
- చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుము.
- సంపదను బట్టి గర్వించకుము.
No comments:
Post a Comment